అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీ ఆ దర్శకుడితోనే – టాలీవుడ్ టాక్

అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీ ఆ దర్శకుడితోనే - టాలీవుడ్ టాక్

0
82

ప్రస్తుతం పుష్ప సినిమా చేస్తున్నారు బన్నీ… ఇక ఈ సినిమా తర్వాత ఆయన ఏ సినిమా చేస్తారు అనే దానిపై అందరూ చర్చించుకుంటున్నారు… నిర్మాత దిల్ రాజు తాజాగా ఓ క్లారిటీ ఇవ్వడంతో ఇక నెక్ట్స్ బన్నీ సినిమా ఏమిటో అర్దం అయింది అంటున్నారు అభిమానులు.

 

 

వకీల్ సాబ్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే.. అయితే నిర్మాత దిల్ రాజు శ్రీరామ్ వేణుతో కలిసి విలేఖరుల సమావేశం నిర్వహించారు. అల్లు అర్జున్తో గతంలో ప్రకటించిన ఐకాన్ మూవీని త్వరలో తెరకెక్కించబోతున్నట్టు చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమా కథ రెడీ ఇక సినిమాని తెరకెక్కిస్తాము అని తెలిపారు.

 

మా బ్యానర్లో నెక్ట్స్ మూవీ ఐకాన్ అని తెలిపారు, అయితే ఇక బన్నీ ఫ్యాన్స్ ఈ వార్త విని చాలా ఆనందంలో ఉన్నారు..

అయితే కొరటాలతో సినిమా అని అందరూ అనుకున్నారు, కాని కొరటాల ప్రస్తుతం తారక్ తో సినిమా చేస్తున్నారు, ఇక త్రివిక్రమ్ మహేష్ తో సినిమా చేస్తున్నారు. సో బన్నీ ఐకాన్ చిత్రం చేయనున్నారు అని టాక్ వినిపిస్తోంది.