అల్లు అర్జున్ పై హృతిక్ రోషన్ సంచలన కామెంట్స్

అల్లు అర్జున్ పై హృతిక్ రోషన్ సంచలన కామెంట్స్

0
142

బాలీవుడ్ కండల వీరుడిగా గ్రీక్ రాడ్ గా చెబుతారు హృతిక్ రోషన్ ని… ఇక కమర్షియల్ యాక్షన్ సినిమాలు అంటే ఆయన పేరే వినిపిస్తుంది, తాజాగా టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ డ్యాన్స్ గురించి హృతిక్ రోషన్ కొన్ని కీలక కామెంట్లు చేశాడు.. అవి బన్నీ అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు, ఇంతకీ హృతిక్ రోషన్ బన్నీ గురించి ఏమన్నారటంటే.

హృతిక్ రోషన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దక్షిణాది హీరోల గురించి ప్రశ్నించగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. హీరో విజయ్ గురించి హృతిక్ మాట్లాడుతూ. వీరు రహస్యంగా ఏదో తింటున్నారు అందుకే డ్యాన్స్ ఇంత బాగా చేస్తున్నారు… అసలు రోజూ చాలా ఉత్సాహంగా ఉంటారు వీరు ఏం తింటారో తెలుసుకుంటా అని అన్నాడు హృతిక్ ..

డ్యాన్స్ చేయడానికి చాలా ప్రాక్టీస్ అవసరమని, ఆపై దాని ఫలితాన్ని వదిలేయాలని చెప్పాడు. ఇక బన్నీ కూడా చాలా మంచి డ్యాన్సర్ వీరు డ్యాన్స్ చేసే ముందు ఏం తింటారో ఈసారి కచ్చితంగా అడిగి తెలుసుకుంటా అని సరదాగా అన్నాడు హృతిక్ .