అల్లు అర్జున్ పులితో ఫైట్….

అల్లు అర్జున్ పులితో ఫైట్....

0
130

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప చిత్రం చేస్తున్నాడు.. ఈ చిత్రంలో అల్లు అర్జున్ కు జంటగా హీరోయిన్ రష్మిక నటిస్తోంది… త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ను స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తవస్తున్నాయి..

వాస్తవానికి కరోనా రాకుంటే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ డేట్ కు ఫిక్స్ కావాలి కానీ కరోనా విజృంభనతో ఇంకా షూటింగ్ పూర్తికాలేదు… ఈచిత్రం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపధ్యంలో సాగనుంది… తాజాగా ఈ చిత్రం గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

ఈ సినిమాలో అల్లు అర్జున్ పులితో ఫైట్ ఉంటుందని చర్చించుకుంటున్నారు.. సినిమా మొత్తం అడవిలో జరగుతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ పులితో ఫైట్ సీన్ ఉందని అంటున్నారు.. కాగా మన్యంపులి చిత్రంలో పులితో ఫైట్ సీన్ ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే…