అల్లు అర్జున్ కి స్పెషల్ గిఫ్ట్ పంపిన విజయ్ దేవరకొండ

అల్లు అర్జున్ కి స్పెషల్ గిఫ్ట్ పంపిన విజయ్ దేవరకొండ

0
89

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి తెలుగులోనే కాదు యావత సౌత్ ఇండియాలో ఎంతో క్రేజ్ ఉంది, అభిమానులు నిత్యం తమ స్టైలిష్ స్టార్ నుంచి ఏ అప్ డేట్ వస్తుందా అని చూస్తారు, డ్యాన్స్ డ్రెస్సింగ్ ఇలా అన్నీ కూడా ఆయననే ఫాలో అవుతారు అభిమానులు, ఇక ప్రతీ ఏడాది హిట్ సినిమాలు ఇస్తూ ఫుల్ ఖుషీ చేస్తున్నాడు బన్నీ.

అయితే ముఖ్యంగా మలయాళంలో బన్నీని అభిమానించే వారి సంఖ్య ఎక్కువనే చెప్పాలి. సెలబ్రిటీలు కూడా అల్లు అర్జున్ను ఎంతగానో ఇష్టపడుతుంటారు. ఇక టాలీవుడ్ యంగ్ హీరోలు అందరూ కూడా బన్నీ గురించి ఎప్పుడూ చెబుతూ ఉంటారు, బన్నీ కూడా వారి చిత్ర ఫంక్షన్ లకు హాజరవుతూ ఉంటాడు.

తన పిల్లల గురించి సినిమాల గురించి అనేక విషయాలు నిత్యం అప్ డేట్ ఇస్తూ ఉంటాడు సోషల్ మీడియాలో, అయితే రీసెంట్గా విజయ్ దేవరకొండ.. బన్నీపై ఉన్న ప్రేమతో స్పెషల్ గిఫ్ట్ పంపారు. ఆ గిఫ్ట్ ఏంటంటే రౌడీ వేర్ నుండి స్పెషల్ గా డిజైన్ చేయబడ్డ టీషర్ట్, డిజైన్ మాస్క్లు, స్పెషల్ ట్రాక్. తాజాగా ఈ వార్త ఇప్పుడు బన్నీ సోషల్ మీడియా ద్వారా చెప్పారు. అయితే అల్లు అర్జున్ కి ఇవి బాగా నచ్చాయి, దీంతో విజయ్ కు థాంక్స్ చెప్పాడు బన్నీ,, ఈ పోస్టుని ఇప్పుడు తెగ వైరల్ చేస్తున్నారు బన్నీ విజయ ఫ్యాన్స్.