అల్లుడికి నాగబాబు కట్నకానుకలు ఎంత ఇస్తున్నారో తెలుసా ?

అల్లుడికి నాగబాబు కట్నకానుకలు ఎంత ఇస్తున్నారో తెలుసా ?

0
120

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి కనిపిస్తోంది… మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక పెళ్లి ఘనంగా చేసేందుకు రెడీ అయ్యారు. డిసెంబర్ 9వ తేదీ రాత్రి 7.15 గంటలకు రాజస్థాన్లోని ఉదయ్పూర్ ప్యాలెస్లో ఘనంగావివాహం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఇరువురి కుటుంబ సభ్యులు మాత్రమే వివాహానికి హాజరుకానున్నారు, ఇక ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు- వరుణ్ తేజ్ఈ పెళ్లి ఏర్పాట్లలో ఉన్నారు.

ఇక రాజస్ధాన్ వెళ్లి అక్కడ ఏర్పాట్లు అన్నీ వరుణ్ చూసుకున్నారు, తాజాగా నాగబాబు తనకు కాబోయే అల్లుడు చైతన్యకు ముట్టజెబుతున్న లాంఛనాలపై ఇప్పుడు చాలా వరకూ వార్తలు వినిపిస్తున్నాయి, సుమారు ఆయన 15 కోట్ల రూపాయల వరకూ లాంఛనాలు ఇవ్వనున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి, తనకు కూతురు కొడుకు సమానం అని నాగబాబు చెబుతూ ఉంటారు, అయితే ప్రస్తుతం బంగారం, ఉన్నా స్ధలాల్లో ఆమెకి సగం ఇవ్వాలి అని నాగబాబు భావించారట.

ఇక పెళ్లి ఖర్చు మొత్తం వరుణ్ చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. నిహారిక నగల కోసం మరో రూ.2కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు
వార్తలు వస్తున్నాయి, అలాగే ఆమెకి ఓ బంగ్లాని కూడా హైదరాబాద్ లో అందివ్వనున్నారట. మొత్తానికి మెగా ఫ్యాన్స్ కూడా మెగా ఫ్యామిలీలో పెళ్లి అంటే ఆ మాత్రం ఖర్చు వైభవం ఉంటాయి అంటున్నారు.