అల్లు అర్జున్ కోసం బాలీవుడ్ న‌టుడు వ‌స్తున్నాడ‌ట‌

అల్లు అర్జున్ కోసం బాలీవుడ్ న‌టుడు వ‌స్తున్నాడ‌ట‌

0
92

అల వైకుంఠ‌పురం చిత్రం త‌ర్వాత బ‌న్నీ కొత్త సినిమా ప‌ట్టాలెక్కించిన విష‌యం తెలిసిందే, ఆయ‌న తాజాగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప చిత్రం చేస్తున్నారు, ఈ సినిమా కూడా ప‌లు భాష‌ల్లో రిలీజ్ అవ్వ‌నుంది, ఇక మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. ముఖ్యంగా ఈ చిత్రం బ్యాక్ డ్రాప్ అంతా శేషాచ‌లం అడ‌వుల నేప‌థ్యంలో ఉంటుంది అని తెలుస్తోంది, మొత్తం గంధ‌పు చెక్క‌ల స్మిగ్గింగ్ కు సంబంధించి చిత్ర స్టోరీ ఉంటుంద‌ట‌.

ఈ చిత్రంలో హీరో బన్నీ లారీ డ్రైవర్‌గా రగ్గడ్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడు. పుష్పరాజ్‌గా బన్నీ పాత్ర నెగెటివ్ అప్రోచ్‌తో సాగుతుందని తెలుస్తోంది. అయితే ఇందులో బ‌న్నీకి విల‌న్ గా ఎవ‌రు న‌టిస్తారు అంటే తెరపైకి కొత్త పేరు వినిపిస్తోంది. బాలీవుడ్ హీరో సునీల్ శెట్టిని ఈరోల్ కోసం తీసుకుంటారు అని తెలుస్తోంది, ఇటీవ‌ల ఆయ‌న ద‌ర్బార్ చిత్రంలో కూడా న‌టించిన విష‌యం తెలిసిందే.