మునుపెన్నడూ చూడని డిఫరెంట్ కథతో ‘అం అః’

-

డిఫరెంట్ టైటిల్, నేటితరం ఆడియన్స్ కోరుకునే థ్రిల్లింగ్ సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘అం అః’ అనే చిత్రం. మునుపెన్నడూ చూడని డిఫరెంట్ కథతో డైరెక్టర్ శ్యామ్ మండ‌ల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సుధాక‌ర్ జంగం, లావ‌ణ్య హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ ‘అం అః’ చిత్రానికి ‘ఎ డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్’ ట్యాగ్‌లైన్‌ పెట్టారు. రంగ‌స్థ‌లం మూవీ మేక‌ర్స్‌, శ్రీ ప‌ద్మ ఫిలిమ్స్ బ్యాన‌ర్స్‌పై జోరిగె శ్రీనివాస్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ప్రముఖ నిర్మాత బెక్కెం వేణు గోపాల్ ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు.

- Advertisement -

152 సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్‌లో.. క్రైమ్, సస్పెన్స్, రొమాన్స్, కామెడీ అన్నీ యాంగిల్స్‌ను చూపించారు. ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. ఇక 24 గంటల్లో 20 లక్షలు ఎలా సంపాదిస్తారు? అక్రమంగా ఇరుక్కున్న కేసు నుంచి హీరో అండ్ ఫ్రెండ్స్ ఎలా తప్పించుకున్నారు? అసలు సిటీలో జరిగే హత్యలకు కారణం ఏంటి? అనే ఉత్కంఠను రేకెత్తించేలా ట్రైలర్ సాగింది. ఇందులో యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉన్నాయి.

ట్రైలర్ రిలీజ్ చేసిన అనంతరం నిర్మాత బెక్కెం వేణు గోపాల్ మాట్లాడుతూ.. ‘రంగస్థలం మూవీ మేకర్స్ బ్యానర్‌లో శ్రీనివాస రావు నిర్మించిన మూవీ ట్రైలర్‌ను విడుదల చేశాం. దర్శకుడు శ్యామ్ నాకు చాలా ఏళ్ల నుంచి తెలిసిన వ్యక్తి. ఆయన దర్శకత్వంలో సుధాకర్ హీరోగా అం అ: అనే చిత్రం రాబోతోంది. ట్రైలర్ చాలా బాగుంది. ఈ టైటిల్‌ను మేం చాలా సార్లు పెట్టాలని అనుకున్నాం. మంచి టైటిల్. ట్రైలర్ మాత్రం చాలా బాగుంది. మీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా. సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతోంది. ఈ కొత్త టీంను అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ఇంకా ఇలాంటి మంచి చిత్రాలను తీయాలని కోరుకుంటున్నా’ ని అన్నారు.

దర్శకుడు శ్యామ్ మాట్లాడుతూ.. ‘ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మించిన బెక్కెం వేణు గోపాల్ గారి చేతుల మీద మా సినిమా ట్రైలర్ రిలీజ్ అవ్వడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆయనకు థ్యాంక్స్. ఆయన బ్లెస్సింగ్స్ మాకు దొరకడం అదృష్టం. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతకు థ్యాంక్స్. నాకు ఎంతో సపోర్ట్ చేసిన టీం అందరికీ థ్యాంక్స్. ఈ చిత్రాన్ని అందరూ థియేటర్లోనే చూడాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

హీరో సుధాక‌ర్ జంగం మాట్లాడుతూ.. ‘సక్సెస్ ఫుల్ చిత్రాలు, మంచి సినిమాలను నిర్మించిన బెక్కెం వేణుగోపాల్ గారు మా సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్. అందరూ వచ్చి ఈ సినిమాను థియేటర్లో చూడాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నిర్మాత శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. ‘ఈ రోజు మా సినిమా ట్రైలర్‌ను విడుదల చేశాం. లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్ గారు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఆయనకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. టీం అంతా ఎంతో కష్టపడి చక్కగా సహకరించి సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ సినిమాను జూలై చివరి వారంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నామ’ని అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...