అమలాపాల్ విడాకులకి కారణం ఆ హీరోనా

అమలాపాల్ విడాకులకి కారణం ఆ హీరోనా

0
87

ప్రేమ పెళ్లి చేసుకున్నారు దర్శకుడు విజయ్ హీరోయిన్ అమలాపాల్ , అందరూ ఎంతో సంతోషించారు.. గ్రాండ్ గా పెళ్లి జరిగింది.
కాని కొద్ది కాలానికే విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. తాజగా విజయ్ తండ్రి, నిర్మాత ఏఎల్.అళగప్పన్ చేసిన వ్యాఖ్యలు అమలాపాల్కు కోపం తెప్పించాయి. అయితే ఆయన మాజీ కోడలుపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆయన.

విజయ్ విడాకులు తీసుకోవడానికి నటుడు ధనుష్ కారణం అంటూ ఆయన తెలిపారు. దానికి కారణం కూడా ఉంది, అమ్మ కణక్కు చిత్రంలో నటించమని అమలాపాల్ను ఆయన కోరాడని, వివాహం అయ్యాక సినిమా చేయను అని చెప్పిందట, మళ్లీ సినిమాలో నటిస్తాను అని చెప్పింది..దీంతో విజయ్ కు అమలాపాల్ కు మధ్య విభేదాలు వచ్చాయట.

కాని దీనిపై ఆమె క్లారిటీ ఇచ్చారు, ఆమెకు ఈ కామెంట్లు చాలా కోపం తెప్పించాయి, ఇక ఎప్పుడో జరిగింది ఇప్పుడు అడుగుతున్నారు ఏమిటి అని మీడియాని అడిగింది ..తన విడాకులకి ఎవరూ సంబంధం లేరు అలా చెబితే విడాకులు తీసుకుంటామా అని ప్రశ్నించింది.. ఇక తన పెళ్లి గురించి ఆలోచించకండి ఇంకా చాలా టైం ఉంది అని మీడియాకి తెలిపింది.