హీరోయిన్ అమలాపాల్ ఇంట విషాదం కన్నీరుమున్నీరు అవుతున్న హీరోయిన్

హీరోయిన్ అమలాపాల్ ఇంట విషాదం కన్నీరుమున్నీరు అవుతున్న హీరోయిన్

0
71

తెలుగులో అగ్రతారలుగా వెలుగొందుతున్న వారు చాలా మంది ఉన్నారు… అందులో అమలాపాల్ కూడా ఒకరు, ఆమెకు వచ్చిన సినిమా అవకాశాలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు, అయితే ఆమె ఇంట ఓ విషాద ఘటన చోటు చేసుకుంది.

ఆమె తండ్రి వర్గీస్ పాల్ హఠాత్తుగా మరణించారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తండ్రి మరణవార్తతో అమలాపాల్ కన్నీటిపర్యంతమైంది. ఆమె ప్రస్తుతం సినిమా షూటింగ్ కోసం చెన్నై వచ్చారు.. ఈ వార్త తెలిసిన వెంటనే ఆమె కేరళ తన సొంత ఇంటికి బయలుదేరారు. నేడు ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి.

బెజవాడ సినిమాతో టాలీవుడ్ లో అమలాపాల్ ఎంట్రీ ఇచ్చింది. రామ్ చరణ్ తో కలిసి నటించిన నాయక్ ఆమెకు మంచి నటిగా గుర్తింపును ఇచ్చింది, తర్వాత బన్నీతో చేసిన ఇద్దరమ్మాయిలతో ఆమెకు మంచి ఫేమ్ తీసుకువచ్చింది, ఆమె తెలుగు తమిళ్ మలయాళ సినిమాల్లో బిజీ నటిగా ఉన్నారు.