అమరావతిలో టాలీవుడ్ హీరో కొత్త వ్యాపారం

అమరావతిలో టాలీవుడ్ హీరో కొత్త వ్యాపారం

0
101

సినిమా నటులు దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకుంటారు.. అయితే సినిమా హీరోయిన్లు ఈ విషయంలో మరింత ముందు ఉంటారు.. చాలా మంది సినిమాలు చేస్తూనే మరో పక్కవ్యాపారాలు చేసే వారు ఉంటారు..అలాంటి వారు చాలా మంది టాలీవుడ్ లో ఉన్నారు.. తాజాగా మరో హీరో కూడా కొత్త వ్యాపారంలోకి ఎంట్రీ ఇస్తున్నారనే వార్త టాలీవుడ్ లో వినిపిస్తోంది.

ఇప్పటికే పలువురు హీరో, హీరోయిన్లు పలు వ్యాపారాలను ప్రారంభించారు. హీరో సందీప్ కిషన్ కూడా ఇప్పటికే సినిమాలతో పాటు ఇతర వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నాడు. వివాహ భోజనంబు పేరుతో రెస్టారెంట్లను నడుపుతున్నాడు భాగ్యనగరంలో. తాజాగా మరో బిజినెస్ ను స్టార్ట్ చేయబోతున్నాడు. మరి ఈ క్రేజీ హీరో కొత్త బిజినెస్ ఏమిటో చూద్దాం.

ఏపీ రాజధాని అమరావతిలో ఓ సెలూన్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడట. ఇప్పటికే ఈ రంగంలో పేరుగాంచిన క్యూబీఎస్ సెలూన్ ఫ్రాంచైజీని సందీప్ తీసుకున్నాడు. ఇప్పుడు డవలప్ మెంట్ అవుతున్న అమరావతిలో త్వరలోనే ఈ సెలూన్ ప్రారంభంకానుంది. చిత్ర నిర్మాణంతో పాటు పలు వ్యాపారాల్లో సందీప్ దూసుకుపోతున్నారు ప్రస్తుతం ఆయన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.