అమెరికాలో వకీల్ సాబ్ అదిరిపోయే రికార్డ్

అమెరికాలో వకీల్ సాబ్ అదిరిపోయే రికార్డ్

0
91

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు.. మొత్తానికి వకీల్ సాబ్ చిత్రం వచ్చేసింది.. ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది, మొత్తానికి రెండు తెలుగు స్టేట్స్ లో కలిసి దాదాపు తొలి రోజు 32 కోట్లు పైనే వసూళ్లు వచ్చి ఉంటాయి అంటున్నారు, అయితే ఇక ఇండియాలో మరో ఆరు కోట్లు మిగిలిన స్టేట్స్ లో వచ్చి ఉంటాయి అని అంటున్నారు… తొలి రోజు సుమారు 40 కోట్లు వచ్చి ఉంటాయి అని అంటున్నారు.

 

అయితే తాజాగా యూఎస్ లో ఈ సినిమా రికార్డు క్రియేట్ చేసింది.వకీల్ సాబ్ యూఎస్ ప్రీమియర్స్ లో సత్తా చాటింది. మొదటిరోజే రికార్డు బ్రేకింగ్ వసూళ్లతో దూసుకెళ్లారు వకీల్ సాబ్ . యూఎస్ఏలో దాదాపు 226 థియేటర్లలో విడుదలై, ప్రీమియర్ షోల ద్వారా 300K డాలర్లను వసూలు చేసింది. ఈ కరోనా సమయంలో అసలు లెక్క చేయకుండా సినిమాకి జనం జాతరలా వచ్చారు.

 

ఈ సంవత్సరం ప్రీమియర్ షో రోజున భారీగా వసూళ్లు రాబట్టిన హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ ఫిల్మ్ గా సరికొత్త రికార్డును సృష్టించాడు వకీల్ సాబ్, మొత్తానికి ఫ్యాన్స్ అయితే చాలా ఆనందంగా ఉన్నారు, కొత్త రికార్డులు ఇండస్ట్రీ రికార్డులు తిరగరాస్తున్నారు అని ఆనంద పడుతున్నారు.