చాలా మంది హీరోలు సినిమా సినిమాకి హీరోయిన్ ని మారుస్తూ ఉంటారు.. ముఖ్యంగా నిర్మాతలు దర్శకుడు కూడా ముంబై నుంచి కొత్త భామలని తెలుగు పరిశ్రమకి పరిచయం చేస్తున్నారు, ఇక చాలా కాలంగా ఈ ట్రెండ్ నడుస్తోంది, అభిమానులు కూడా తమ హీరోలతో కొత్త భామలు చేయాలి అని కోరుతున్నారు. అందుకే అన్నీ చిత్ర సీమల్లో ఇదే ట్రెండ్ నడుస్తోంది.
అల్లు అర్జున్ కొత్త సినిమాలో కథానాయికగా బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్ నటించనున్నట్టు వార్తలొస్తున్నాయి. తాజాగా బన్నీ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా చేస్తున్నారు, ఈ సినిమా తర్వాత ఆయన కొరటాల శివతో సినిమా చేయనున్నారు.
ఈ సినిమాలో తాజాగా సయీ మంజ్రేకర్ నటించనున్నట్టు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఇక ఈ ముద్దుగుమ్మతో ఇటీవల చిత్ర యూనిట్ సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి.
దబాంగ్ 3లో సల్మాన్ సరసన నటించింది ఇక మేజర్ సినిమాలో ప్రస్తుతం చేస్తోంది ఈనటి.