ఆమిర్ ఖాన్ దగ్గర ఉండే వ్యక్తితో ప్రేమలో పడిన కూతురు – ఎవరంటే

ఆమిర్ ఖాన్ దగ్గర ఉండే వ్యక్తితో ప్రేమలో పడిన కూతురు - ఎవరంటే

0
118

ఆమిర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ కొన్ని రోజులుగా బాగా వార్తల్లోకెక్కిన ఈ అమ్మడు ఇప్పుడు మరో సంచలనం సృష్టించింది అనే చెప్పాలి, తన మానసిక ఇబ్బంది గురించి ఇటీవల చెప్పిన ఈ భామ తను 14 ఏళ్ల వయసులో లైంగిక వేధింపులకి గురి అయ్యాను అని తెలిపింది.

అయితే ఇప్పుడు ఆమె ప్రేమ విషయం బాలీవుడ్ లో వైరల్ అవుతోంది.. జిమ్ ట్రైనర్ నుపూర్ శిఖారెతో ఐరా ప్రేమలో పడినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆమిర్ జిమ్ ట్రైనర్ అయిన నుపూర్ లాక్డౌన్ సమయంలో ఐరా చేత కూడా వర్కవుట్లు చేయించాడట.

అంతేకాదు ఈ సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించింది అని వార్తలు వినిపిస్తున్నాయి, అయితే దీని గురించి ఎక్కడా వారి కుటుంబం బయటపెట్టలేదు.. వీరి ప్రేమను ఐరా తల్లి రీనా దత్తా ఆమోదించిందట. దీంతో మహాబలేశ్వర్లోని ఆమీర్ ఫామ్హౌస్లో ఈ జంట పార్టీ చేసుకుంది అని వార్తలు వినిపిస్తున్నాయి, సో దీనిపై బీ టౌన్ లో వార్తలు వినిపిస్తున్నాయి.