బిగ్ బి అమితాబ్ కూతురు కొత్త వ్యాపారం

బిగ్ బి అమితాబ్ కూతురు కొత్త వ్యాపారం

0
96

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కుటుంబం ఎప్పుడూ వార్తల్లో రారు ..మీడియాకి అమితాబ్ మినహా మరెవరూ పెద్దగా ఇంటర్వ్యూలు ఇవ్వరు, అయితే చాలా ప్రైవసీగా ఉంటారు, తాజాగా అమితాబ్ బచ్చన్ తన కూతురు శ్వేతా బచ్చన్ పై ప్రేమను మరోసారి చాటుకున్నారు. ఎందుకు అంటే తాజాగా ఆమె క్లాత్ వ్యాపారంలోకి అడుగు పెట్టారు, శ్వేత ప్రముఖ డిజైనర్ మోనిషా జైసింగ్ తో కలిసి ఎమ్ ఎక్స్ ఎస్ అనే బ్రాండ్ నేమ్ తో కొత్త డిజైనర్ వేర్ ను స్టార్ట్ చేసింది.

తాజాగా ముంబైలో దీనిని లాంచ్ చేశారు, ఈ కార్యక్రమానికి బిగ్ బి కూతురు శ్వేత డెనిమ్ జాకెట్ ధరించి హాజరైంది. ఆ జాకెట్ కుడి చేయి స్వీవ్ పై తండ్రి అమితాబ్ బొమ్మ ఉంది. ఇక ఈ ఫోటోలు అన్నీ కలిపి బిగ్ బీ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు,

కీర్తి, గౌరవం లభించిన రోజు ఇది. మన పిల్లలు ఉన్నత స్థాయికి ఎదిగినప్పుడు, వాళ్లు ఏదైనా సాధించినప్పుడు, మనకు ఆనందభాష్పాలు తెప్పించినప్పుడు, వాళ్ల సయంకృషి ఫలితాన్ని ఇచ్చినప్పుడు, ఈ ప్రపంచం వాళ్ల శ్రమను గుర్తించి మెచ్చుకున్నప్పుడు మన ముఖంలో మెరుపు కనిపిస్తుంది. మా అందరినీ గర్వపడేలా చేసినందుకు లవ్ యూ శ్వేతా అని పోస్ట్ చేశారు.