మన హీరో కోసం ఫ్రీగా సినిమా చేసిన అమితాబ్

మన హీరో కోసం ఫ్రీగా సినిమా చేసిన అమితాబ్

0
96

మెగస్టార్ చిరంజీవి హీరోగ నటిస్తున్న లెటెస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఈ సినిమాను కొణిదెల ప్రోడక్షన్స్ బ్యానర్‌లో రామ్ చరణ్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాడు.

దాదాపు రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సైరా నరసింహారెడ్డిలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చాన్ ఉయ్యాల వాడ నరసింహారెడ్డి గురువు పాత్ర గోసాయి వెంకన్న పాత్రలో నటించారు. సోమ వారం ఈ సినిమా టీజర్‌ను ముంబాయిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విడుదల చేశారు.

అనంతరం సైరా ప్రమోషన్స్‌లో భాగంగా చరణ్ ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన అమితాబ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అమితాబ్ చరణ్ ప్రొడక్షన్ నుంచి విమానం టికెట్లు డబ్బులు తీసుకోవడానికి కూడా నిరాకరించారట, అయితే అందులో వింత ఏముందా అనుకోకండి ఆయన కనీసం రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదట. సినిమా మొత్తం ఫ్రీగా చేశారట అది కూడా చిరు మీదున్న ప్రేమతో ఈ విషయం మీద చిరు మాట్లాడుతూ అమితాబ్ కోసం ప్రైవేటు జెట ఏర్పాటు చేద్దావునుకున్నామని కానీ ఆయన ఒప్పుకోలేదు సరి కదా ఆయన టిక్కెట్లు పెట్టుకుని వచ్చారని అన్నారు.