‘అఖండ’ నుండి అమ్మ ఫుల్ సాంగ్ రిలీజ్ (వీడియో)

0
112

సింహా’, ‘లెజెండ్’​ తర్వాత బోయపాటి- బాలయ్య కాంబోలో వచ్చిన హ్యాట్రిక్​ సినిమా ‘అఖండ’. డిసెంబర్​ 2న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. విదేశాల్లోనూ అఖండ అదరగొట్టింది. బాలయ్య కెరీర్ లో అఖండ చిత్రం అత్యధిక వసూలు చేసిన సినిమాగా నిలిచింది.

ఈ చిత్రంలోని అఖండ టైటిల్ సాంగ్, జై బాలయ్య వీడియో సాంగ్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ మూవీలోని మరో ఫుల్ వీడియో సాంగ్​ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. అమ్మా అంటూ సాగె ఈ పాటకు మ్యూజిక్​ డైరెక్టర్​ తమన్​ అద్భుతమైన స్వరాలను అందించాడు. ఈ పాటను ప్రముఖ పాటల రచయిత కళ్యాణ్​ చక్రవర్తి రాయగా..బుల్లెట్​ బండి ఫేమ్​ మోహనా భోగరాజ్​ పాడింది.

ఈ చిత్రంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్​గా నటించింది. శ్రీకాంత్, పూర్ణ కీలకపాత్రల్లో కనిపించారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. మరోవైపు బాలయ్య గోపిచంద్ మలినేనితో, అనిల్ రావిపూడితో సినిమాలు చేయాల్సి ఉంది.

https://www.youtube.com/watch?v=GBxw60VIOx0