అమ్మరాజశేఖర్ రియల్ స్టోరీ

అమ్మరాజశేఖర్ రియల్ స్టోరీ

0
115

అమ్మరాజశేఖర్ ప్రముఖ కొరియోగ్రాఫర్ దర్శకుడు, ఆయన ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో అందరిని అలరిస్తున్నారు, ఇక హౌస్ లో అందరిని నవ్విస్తూ చాలా జోష్ గా ఉన్నారు అమ్మరాజశేఖర్, అయితే ఆయన రియల్ స్టోరీ తెలుసుకుందాం..

అమ్మ రాజశేఖర్ ది తమిళనాడు, ఆయన చిన్నతనం నుంచి డ్యాన్స్ బాగా చేసేవారు, అలా చదువు అయ్యాక సినిమాల్లోకి వచ్చారు. డ్యాన్స్ మాస్టర్ గా ఆయనకు పేరు ఉంది.. సినిమాలు చేస్తున్న ఈ సమయంలో హైదరాబాద్ లో మోడల్ ని పెళ్లి చేసుకున్నారు, ఆమె పేరు రక్షిత,
వారికి పాప బాబు ఉన్నారు. వీరిది ప్రేమ వివాహం.

ఇక కొరియోగ్రాఫర్ గానే కాకుండా దర్శకుడిగా కూడా మారారు ఆయన.. తెలుగులో గోపిచంద్ హీరోగా రణం సినిమా తీశారు.. తర్వాత మాస్ హీరో రవితేజ ఖతర్నాక్ సినిమా తీశారు…తర్వాత నితిన్ తో టక్కరి తీశారు, ఇక తెలుగు తర్వాత తమిళ్ లో ఆరు సినిమాలు చేశారు, అయితే అక్కడ రెండు సూపర్ హిట్ అయ్యాయి.
ఆయనకు మంచి పేరు వచ్చింది, తర్వాత ఆయన ప్రముఖ యాంకర్ ఓంకార్ తో ఆట -చాలెంజ్ షోలకు జడ్జీగా చేశారు. ఈ షోలతో మంచి పాపులారిటీ సంపాదించారు, అంతేకాదు సినిమాలలో హీరోగా నటించారు కాని అవి పెద్ద హిట్ అవ్వలేదు.