తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ఈ వారం ఎనిమిదో వారం నడుస్తోంది, గత వారం దసరా స్పెషల్ అదరగొట్టారు, మరి ఈ వారం హోస్ట్ గా సమంత వస్తారా లేదా నాగార్జున వస్తారా అనేది పెద్ద ప్రశ్న, అయితే ఇప్పుడు ఈ వారం హౌస్ నుంచి నామినేట్ అయిన సభ్యులు ఆరుగురు ఉన్నారు.
బిగ్ బాస్ హౌజ్ లో 11 మంది హౌజ్ మేట్స్ ఉన్నారు. అమ్మా రాజశేఖర్, అఖిల్, మోనాల్, మెహబూబ్, లాస్య, అరియానా ఉన్నారు. ఇక అరియానా సేవ్ అవుతుంది అని అందరూ అంటున్నారు, అయితే ఆన్ లైన్ పోల్స్ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు చూస్తుంటే అమ్మా రాజశేఖర్ మెహబూబ్ మధ్య పోటీ కనిపిస్తోంది.
వీరిద్దరిలో తక్కువ ఓట్లు వచ్చే వారు హౌస్ నుంచి బయటకు వస్తారు, అయితే ఎక్కువగా బయటకు వచ్చేది అమ్మా రాజశేఖర్ పేరు మాత్రమే వినిపిస్తోంది, సో బిగ్ బాస్ హౌస్ లో ఏమైనా జరగవచ్చు, ఈ వారం నోయల్ బయటకు వెళ్లారు కాబట్టి ఎలిమినేషన్ ఉండకపోవచ్చు, లేదా డబులు ఎలిమినేషన్ ఉండవచ్చు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండవచచు, ఈ వారం నో ఎలిమినేషన్ తో వచ్చే వారం డబుల్ ఎలిమినేషన్ జరగవచ్చు అంటున్నారు అభిమానులు.