నవంబర్ 12న థియేటర్ లలో రిలీజ్ అవుతున్న ఆనంద్ దేవరకొండ “పుష్పక విమానం”

-

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన కొత్త చిత్రం “పుష్పక విమానం” రిలీజ్ కు రెడీ అవుతోంది. నవంబర్ 12న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ‘‘దొరసాని’’, ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ చిత్రాల తర్వాత ఆనంద్ దేవరకొండ నటిస్తున్న “పుష్పక విమానం” సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.

- Advertisement -

“పుష్పక విమానం” చిత్రాన్ని నూతన దర్శకుడు దామోదర తెరకెక్కించారు. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సమర్పిస్తున్న ఈ మూవీ ని ‘కింగ్ అఫ్ ది హిల్’ ప్రొడక్షన్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. గోవర్ధన్ రావు దేవరకొండ,విజయ్ దషి ,ప్రదీప్ ఎర్రబెల్లి లు నిర్మాతలు. పాండమిక్ వల్ల విడుదల కోసం వేచి చూసిన “పుష్పక విమానం” టీమ్ సరైన డేట్ ను ఫిక్స్ చేసుకుంది. నవంబర్ 12న సినిమా విడుదలకు ముహూర్తం నిర్ణయించింది. “పుష్పక విమానం” చిత్రంలోని కళ్యాణం కమనీయం పాట ఇప్పటికే సూపర్ హిట్టయి సినిమాకు ఆకర్షణగా నిలించింది. రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా

డైరెక్టర్ దామోదర మాట్లాడుతూ…”పుష్పక విమానం” ఒక కాన్సెప్ట్ బేస్డ్ మూవీ. ఇందులో ఆనంద్ ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ గా కనిపిస్తారు. ఈ కథ ప్రధానంగా మధ్యతరగతి కుటుంబాలలో వుండే డ్రామా ని గుర్తుచేస్తూ , పెళ్లి చుట్టూ వుండే పరిస్థితులని చూపెడుతుంది . ఇది ఫ్యామిలీ అంతా చూడదగ్గ కామెడీ చిత్రం. నవంబర్ 12న థియేటర్లలో కలుసుకుందాం ” అన్నారు

టెక్నికల్ టీమ్:
సమర్పణ : విజయ్ దేవరకొండ
పి.ఆర్.వో: జి.ఎస్.కె మీడియా
సినిమాటోగ్రఫీ: హెస్టిన్ జోస్ జోసెఫ్, ఆర్ట్ డైరెక్టర్ : నీల్ సెబాస్టియన్,
ఎడిటర్ : రవితేజ గిరిజాల,
మ్యూజిక్: రామ్ మిరియాల, సిద్దార్థ్ సదాశివుని, అమిత్ దాసాని.
కాస్టూమ్స్ : భరత్ గాంధీ
నిర్మాతలు: గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ దషి , ప్రదీప్ ఎర్రబెల్లి
రచన-దర్శకత్వం: దామోదర

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...