‘సర్కారు వారి పాట’ సినిమాపై ఆనంద్ మహీంద్ర ట్వీట్ వైరల్..ఇంతకీ ఏమ్మన్నారంటే?

0
96

స్టార్‌ డైరెక్టర్‌ పరుశురాం దర్శకత్వంలో టాలీవుడ్‌ స్టార్‌ హీరో మహేష్‌ బాబు, కీర్తి సురేష్ నటించిన “సర్కారు వారి పాట” గురువారం థియేటర్లలో విడుదలయి మహేష్ ఫాన్స్ ను అబ్బురపరిచింది. నవీన్ ఎర్నేని, వైరవిశంకర్ మరియు గోపి ఆచంట నిర్మాతలుగా బాధ్యతలు స్వీకరించి తెరెకెక్కిస్తున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించాడు.

ఈ సినిమా గురువారం థియేటర్లలో విడుదలయి పాజిటివ్ టాకుతో దూసుకుపోతుంది. బ్యాంకింగ్ నేపథ్యంలో కొనసాగిన ఈ సినిమాలో మహేష్ యూఎస్ లో ఓ బ్యాంక్‌ లో రికవరీ ఎంప్లాయ్‌గా కొత్త లుక్ లో కనపడి అభిమానులను ఖుషి చేసాడు. ఈ సినిమా తాజాగా 200 కోట్ల క్లబ్ లో కూడా చేరి కలెక్షన్ల సునామి సృష్టించింది.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆనంద్ మహీంద్ర చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈయన సర్కారు వారి పాట సినిమాలో జావా బైక్ మీద మహేష్ బాబు ఉన్న విజువల్స్ మిస్ అయినందుకు బాధపడుతున్నారు. అయితే ప్రస్తుతం తాను న్యూయార్క్ లో ఉన్నానని, కానీ న్యూజెర్సీలో సర్కారు వారి పాట మూవీ చూస్తానని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.