డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా మూవీ లైగర్. ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీలో రౌడీ హీరో బాక్సర్ గా కనిపించనున్నట్లు తెలుస్తుంది.
పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నాడు. విజయ్ తల్లి పాత్రలో రమ్యకృష్ణ ఆకట్టుకోనున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్, పాటలు సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి. ‘లైగర్’ ఆగస్టు 25న విడుదలకానుంది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది టీమ్.
తాజాగా ఈ చిత్రం నుండి మూడో సాంగును విడుదల చేసింది చిత్రబృందం. శుక్రవారం సాయంత్రం కోకా 2.0 సాంగ్‌ను విడుదల చేసింది. గతంలో లైగర్ నుంచి వచ్చిన పాటలకు ఏ మాత్రం తీసిపోకుండా ఈ కొత్త సాంగ్ ఉంది. ముఖ్యంగా విజయ్ తలపాగ, కుర్తా పైజామా, అనన్య లెహాంగాలో ట్రెడిషనల్ లుక్స్‌లో అదరగొట్టారు.
వీడియో చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి.
https://www.youtube.com/watch?v=6DLDnALav-8