అరాచకంగా ‘అన్నాత్తే’ టీజర్‌..ఊరమాస్ అంతే!

Anarchically ‘Annatte’ teaser

0
133

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమాకు సంబంధించి ఏ చిన్న ఆప్డేట్‌ వచ్చిన ఆయన ఫ్యాన్స్‌కు పండగే. తాజాగా రజనీ నటిస్తున్న`అన్నాత్తే` చిత్ర టీజర్‌ని దసరా సందర్భంగా విడుదల చేశారు. శివ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నయనతార, కీర్తిసురేష్‌, మీనా, ఖుష్బు కథానాయికలుగా కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన రజనీ క్యారెక్టర్‌ ఫస్ట్ గ్లింప్స్, ఫస్ట్ లుక్‌ నెట్టింట హల్‌చల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

టీజర్‌లో.. రజనీ వింటేజ్‌ మార్క్‌ కనిపిస్తోంది. సినిమా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపోందించినట్లు తెలుస్తుంది. ఈ ఏజ్‌లోనూ రజనీ యాక్షన్‌ సన్నివేశాలతో పాటు తనదైన మేనరిజం నటనతో ఇరగదీశాడనే చెప్పాలి. ఈ టీజర్‌తో సినిమాపై అంచనాలను పెరగనున్నాయి. బాక్స్‌ఫీస్‌ ముందు ‘అన్నాత్తే’ ఎటువంటి ఫలితం రాబోతుందంటే దీపావళి వరకు ఆగాల్సిందే మరి.

టీజర్ చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి

https://www.youtube.com/watch?v=EqOSFhIKbRg