బన్నీకి వ్యతిరేకంగా రంగమ్మత్త…

బన్నీకి వ్యతిరేకంగా రంగమ్మత్త...

0
82

రంగస్థలం చిత్రంలో మెగా స్టార్ రామ్ చరణ్ ను సరికొత్తగా ఆవిష్కరించిన దర్శకుడు సుకుమార్ తన తొలిచిత్రం కథాయకుడు అల్లు అర్జున్ ను కూడా డిఫరెంట్ లుక్ లో చూపే ప్రయత్నం చేస్తున్నాడట…. ఎర్రచందనం అక్రమ రవాన నేపథ్యంలో సాగే ఈ సినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్నట్లు ఫిలిం నగర్ లో టాక్…

త్వరలో రెండవ షెడ్యూల్ ను కూడా స్టార్ట్ చేయాలని చూస్తున్నారు…ఇక రంగస్థలంలో రంగమ్మత్త గా నటించిన అనసూయ ఈ చిత్రంలో నెగిటివ్ టచ్ లో ఉన్న పాత్రలో కడబడుతోందని సమాచారం అందుతోంది… మరి సోషల్ మీడియాలో వార్తలపై అనసూయ ఎలా స్పందిస్తుందో చూడాలి..

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం శేషాచలం ప్రాంతాల్లో సాగే కథ కావడంతో ఈ చిత్రానికి శేషాచలం అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.. అలాగే మరో మూడు టైటిల్లు కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం…