బుల్లితెరలో ఒక ప్రముఖ ఛానల్ లో ప్రసారం అయ్యే జబర్దస్త్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది అనసూయ బరద్వాజ్… తన వొంపు సొంపులతో హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ వెండితెరలోకి కూడా ఎంట్రీ ఇచ్చి పలు చిత్రాల్లో నటించిన మంచి గుర్తింపు తెచ్చుకుంది…
వెండితెరలో రామ్ చరణ్ హీరోగా నటించిన చిత్రం రంగస్థలం ఈ చిత్రంలో రంగమ్మత్తగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది… ఇక అక్కడ నుంచి వెండితెరలో అనసూయకి స్పీడ్ పెరిగింది… విభిన్న పాత్రలతో నటించిన అభిమానులను ఆకట్టుకుంటుంది..
ఇటీవలే సుశాంత్ అశ్విన్ హీరోగా రూపొందుతున్న ఒక చిత్రంలో హీరో తల్లి పాత్రకు గాను అనసూయను సంప్రదించారనే వార్తలు వస్తున్నాయి.. మొదటి ఆ పాత్రను ఇంద్రజతో చేయించాలని మేకర్స్ భావించారు.. అయితే ఇంద్రజ ఇప్పట్లో హైదరాబాద్ రాలేను అంటూ చెప్పడంతో వారు అనసూయను సంప్రదించారట… కాగా ఇప్పటివరకు హీరోలకు అమ్మపాత్ర చేయలేదు అనసూయ…