అనసూయ‌కు బిగ్ ఆఫ‌ర్ కాని వ‌ద్దంద‌ట ఎందుకంటే?

అనసూయ‌కు బిగ్ ఆఫ‌ర్ కాని వ‌ద్దంద‌ట ఎందుకంటే?

0
84

అన‌సూయ జ‌బ‌ర్ధ‌స్త్ నుంచి ఎంత ఫేమ్ సంపాదించిందో తెలిసిందే, అక్క‌డ నుంచి సినిమాల్లో కూడా ఆమె నటించారు, మంచి మంచి పాత్ర‌లతో ప్రేక్ష‌కుల అభిమానం సంపాదించుకుంది రంగ‌మ్మ‌త్త‌, ఇక రంగ‌స్ధ‌లం ఎంత మంచి పేరు తెచ్చిందో తెలిసిందే, ఇక ప్ర‌ధాన చిత్రాల్లో ఇప్పుడు ఆమె న‌టిస్తోంది, ప‌లు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.

అయితే తాజాగా బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 4కి ఆమెకి ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి, అయితే ఈసారి చాలా డిఫ‌రెంట్ గా ప్లాన్ చేస్తున్న బిగ్ బాస్ టీం, సీనియ‌ర్ల‌ను సెల‌బ్రెటీల‌ను తీసుకురావాలి అని భావిస్తున్నారు, అందులో భాగంగా అన‌సూయ‌ని సంప్ర‌దించారు అని తెలుస్తోంది.

గత సీజన్లో యాంకర్ శ్రీముఖిని ఎంపిక చేసుకున్న నిర్వాహకులు, ఈ సారి అన‌సూయ‌ని సంప్ర‌దించార‌ట‌,కాని ఆమె నో చెప్పింది అని తెలుస్తోంది, ఆమె టీవీ షోలు ఫ్రోగ్రామ్స్ సినిమాల‌తో బిజీగా ఉంది, ఇక ఫ్యాన్స్ కు , ఫ్యామిలీకి దూరంగా అన్నీ రోజులు ఉండ‌లేను అని చెప్పింద‌ని తెలుస్తోంది. ఆమెకి భారీ ఆఫ‌ర్ అయితే ఇచ్చార‌ట నిర్వాహ‌కులు అని వార్త‌లు వ‌స్తున్నాయి.