పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్నారు, ఇక తాజాగా ఆయన
దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు, ఇక ఇంకా ఈ సినిమాకి టైటిల్ ఫిక్స్ చేయలేదు.. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాకి సంబంధించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా మరో ఆసక్తికర వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది…ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ఈ సినిమాలో ఓ కీలక రోల్ చేయనున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక పవన్ కల్యాణ్ సినిమా అంటే ఎవరైనా ఒకే అంటారు.. ఇప్పుడు ఆమె కూడా ఒకే చెప్పారు అని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ ఏడాదే ఆమె తమిళ్, మలయాళ ప్రేక్షకులకు కూడా పరిచయం కాబోతున్నారు. ఇక తెలుగులో మూడు సినిమాలు చేస్తున్నారట. అయితే దీనిపై ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. అఫీషియల్ ప్రకటన ఇంకా రాలేదు,ఈ వార్తలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.