అనసూయకు గుడ్ న్యూస్ చెప్పిన దర్శకుడు సుకుమార్

అనసూయకు గుడ్ న్యూస్ చెప్పిన దర్శకుడు సుకుమార్

0
122

అలవైకుంఠపురంలో చిత్రం పూర్తి అయిన తర్వాత బన్నీ చేస్తున్న సినిమా దర్శకుడు సుకుమార్ తో… ఈ సినిమా టైటిల్ కూడా శేషాచలం అనే పేరు ఉంటుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.. అంతేకాదు ఈ కథ అంతా శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో నడుస్తుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు.

ఆంధ్ర నేపథ్యంలో జరిగే కథే అయినప్పటికీ కేరళ అడవుల్లో చిత్రీకరిస్తున్నారు. ఆల్రెడీ తొలి షెడ్యూల్ చిత్రీకరణను ఇటీవలే అక్కడ పూర్తిచేశారు. అయితే ఆయన మాత్రం అక్కడ షెడ్యూల్ షూటింగులో పాల్గొనలేదు, ఇప్పుడు ఇక ఆయన షూటింగ్ కు వెళ్లనున్నారు. అయితే ఈ సెషన్లో షూటింగ్ సమయంలో బన్నీతో పాటు ప్రముఖ యాంకర్ నటి అనసూయ కూడా బన్నీతో పలు సీన్స్ చేయనున్నారట.

ఆమెకు ఇందులో కీలక పాత్ర చేసే అవకాశం వచ్చింది అని తెలుస్తోంది, అయితే సుకుమార్ సినిమా రంగస్ధలం ఎంత హిట్ అయిందో తెలిసిందే..ఇందులో అనసూయ రంగమ్మత్తగా బాగా నటించింది.. చరణ్ తర్వాత ఆమెకు అంత పేరు వచ్చింది సినిమాలో.. అందుకే ఇప్పుడు బన్నీ సినిమాలో మంచి పాత్ర వచ్చిందట, ఈ సినిమాలో పాత్ర గురించి సుకుమార్ చెప్పగానే ఆమె ఒకే చెప్పారట.