పొలిటికల్ లీడర్ కు క్షమాపణ చెప్పిన అనసూయ

పొలిటికల్ లీడర్ కు క్షమాపణ చెప్పిన అనసూయ

0
91

బుల్లితెరలో కనిపించే యాంకర్ అనసూయ ఏంటి పొలిటికల్ లీడర్ కు క్షమాపణ చెప్పడం ఏంటని అందరు అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నా ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలను తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు..

ఈ నేపథ్యంలో యాంకర్ అనసూయ కూడా నల్లమల అడవులను ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది… నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు జరిపితే అక్కడ గడ్డిపోచ కూడా మలవదని అన్నారు. అందుకే ఇరు తెలుగు రాష్ట్రల అటివి శాఖ మంత్రులు స్పందించాలని వారి పేర్లను ట్యాగ్ చేసింది.

ఏపీ అటవి శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ ను ట్యాగ్ చేసిన ఈ ముద్దుగుమ్మ… తెలంగాణ అటవిశాఖ మంత్రి విషయంలో పొరపాటున మాజీ మంత్రి జోగు రామన్న పేరును ట్యాగ్ చేసింది. దీంతో నెటిజన్స్ కామెంట్స్ చేశారు. అసలు విషయం తెలుసుకున్న అనసూయ జోగురామన్నకు క్షమాపణ చెప్పింది. తనకు కరెంట్ అఫైర్ పెద్దగా తెలియదని చెప్పుకొచ్చింది.