ఎప్పుడూ ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలిచే నటి అనసూయ(Anasuya) మళ్లీ వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో ఎవరో ఒకరి మీద కౌంటర్లు వేస్తూ, తనపై విమర్శలు చేసే వాళ్ళకి ఘాటు సమాధానాలు చెబుతూ ఉంటుంది. ఇలా ఎప్పుడూ హాట్ టాపిక్ గానే నిలుస్తుంది. అయితే ఈసారి వివాదాస్పద పోస్టులతో కాదు.. ఏకంగా వెక్కి వెక్కి ఏడుస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అనసూయ ఏడ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
“సోషల్ మీడియా అనేది అందరినీ కలిపేలా ఉంటుంది. అలాగే ఒకరి విషయాలు, అభిప్రాయాలు పంచుకోవడానికి ఇది ఒక వేదికలా ఉంటుంది. అలాగే ఇతరుల జీవన విధానం, సంస్కృతి తెలియటం కోసం ఇది ఒక మంచి ప్రదేశం అని భావించాను. కానీ ఇటువంటివి ఏమైనా ఉన్నాయా అని ఆశ్చర్యపోయాను అని రాసింది. నా ఫోటోస్, డాన్స్ వీడియోస్ వ్యక్తిగతమైనవి. నేను ఏది పోస్ట్ చేసినా అవన్నీ నా జీవితంలో ఒక భాగం. అన్ని అభిమానులతో పంచుకుంటాను. అలాగే నా బాధని కూడా షేర్ చేసుకోవాలనుకున్నాను. నా లైఫ్ లో బాధాకరమైన రోజులు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. కానీ ఒకసారి పడ్డాక మళ్ళీ లేచి వస్తాను” అని పోస్టులో తెలిపింది.
అలాగే ఇది అయిదు రోజుల క్రితం వీడియో అని ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను అని తెలిపింది. అనసూయ(Anasuya) వీడియోపై భిన్నమైన కామెంట్స్ వస్తున్నాయి. మరి అనసూయ ఈ ఏడ్చే వీడియో ఎందుకు పెట్టిందో తెలియాలి మరి.
Read Also: జాబిల్లికి మరింత చేరువగా చంద్రయాన్-3.. రోజురోజుకూ ఉత్కంఠ