బుల్లితెర ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు యాంకర్ లాస్య, ఆమె ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే..2017 ఫిబ్రవరిలో మంజునాథ్‌ను లాస్య పెళ్లిచేసుకుంది, ఇక తర్వాత ఆమె యాంకరింగ్ కు గుడ్ బై చెప్పారు, ఇక కొన్ని నెలలకు ఆమె యూ ట్యూబ్ ద్వారా వీడియోలు పెడుతూ మళ్లీ అభిమానులకి దగ్గర అయ్యారు.
సోషల్ మీడియాలో ఆమెకి లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు, లాస్య టాక్స్ వీడియోలు చూస్తున్నారు,
ఈ సమయంలో బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొనడం ద్వారా మరింత ఫేమస్ అయ్యారు, ఇక ఆమెకి సినిమా అవకాశాలు వస్తున్నాయి
పలు షోలు ఇంటర్వ్యూలు చేయాలి అని కోరుతున్నారు, ఇక ఆమె ఇన్ స్టా అకౌంట్ కు
1.1 మిలియన్ మంది ఫాలోవర్స్ ఉన్నారు, తాజాగా బిగ్ బాస్ ద్వారా తాను సంపాదించిన మొత్తంతో తన భర్తకు మంచి బహుమతి ఇచ్చారు లాస్య. ఫిబ్రవరి 15న లాస్య, మంజునాథ్ వివాహ వార్షికోత్సవం.
ఇక భర్తకు మంచి గిఫ్ట్ ఇచ్చారు లాస్య..మహీంద్ర ఎక్స్‌యువి 500 కారును లాస్య బహుమతిగా ఇచ్చారు.
ఈ విషయం సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. సుమారు ఆ కారు విలువ 25 లక్షలు ఉంటుంది అంటున్నారు.
https://www.instagram.com/p/CLWUQxJFfZ4/?utm_source=ig_embed