యాంకర్ లాస్య రియల్ స్టోరీ

యాంకర్ లాస్య రియల్ స్టోరీ

0
126

బుల్లి తెర షోలలో యాంకరింగ్ తో ఆమెకి ఎంతో క్రేజ్ వచ్చింది… పలు సినిమా ఈవెంట్లకి కూడా ఆమె యాంకర్ గా ఉండేది, యాంకర్ రవి లాస్య చేసే కామెడీ యువతకి ఎంతో నచ్చేది, అయితే ఇప్పుడు ఆమె బిగ్ బాస్ హౌస్ లో సందడి చేస్తోంది, మరి అసలు లాస్య రియల్ స్టోరీ చూద్దాం.

యాంకర్, టీవీ షో హోస్టుగా లాస్యా మంజునాథ్ కు మంచి పేరు ఉంది.. 2012లో యాంకర్ రవితో కలిసి Something Special షోతో పాపులర్ అయింది… ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో జన్మించిన లాస్యా హైదరాబాద్లోని ప్రముఖ చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ చేసింది. షో తరువాత ఆమె 2014లో వరుసగా మొండి మొగుడు పెంకి పెళ్లాం- 2016లో మా ఊరి వంట, 2017లో ఢీ అల్టిమేట్ డాన్స్ షోఇలా పలు రకాల టీవీ షోలతో ఆకట్టుకుంది యాంకర్ గా.

ఇక తర్వాత పలు అవకాశాలు ఆమెకి వచ్చాయి, ఇక 2014లో ఆమెకిబెస్ట్ ఫిమేల్ వీడియో జాకీ అవార్డు వరించింది..ప్రేమించిన వ్యక్తి మంజునాథ్తో 2010లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది.. కాని ఈ సమయంలో కుటుంబంలో ఎవరూ ఒప్పుకోలేదు , తర్వా త పెద్దలను ఒప్పించి 2017లో మరోసారి అందరి సమక్షంలో భర్తతో ఏడడుగులు నడిచింది. ఇక బిగ్ బాస్ 4 హౌస్ లో ఆమె సందడి చేస్తోంది.