యాంకర్ రష్మి కామెంట్ పై సర్వత్రా చర్చ – చాలా మంచి పాయింట్

యాంకర్ రష్మి కామెంట్ పై సర్వత్రా చర్చ - చాలా మంచి పాయింట్

0
99

సమాజంలో జరిగే అంశాలు సంఘటనలపై యాంకర్ రష్మి కొన్ని సార్లు మాట్లాడుతుంది, సోషల్ మీడియాలో తన అభిప్రాయాలు చెబుతుంది, ముఖ్యంగా మహిళలు చిన్న పిల్లలపైదాడులు ఇలాంటి అంశాలపై తన బాధని చెబుతుంది, సలహాలు సూచనలు ఇస్తుంది, తాజాగా ఆమె ఓ కామెంట్ చేసింది సరోగసి విధానంపై.

సరోగసీ అద్దె గర్భంపై సినీ నటి, యాంకర్ రష్మి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి… ఇలా అద్దె గర్బం ద్వారా చాలా మంది పిల్లలు కంటున్నారు, ఇలా ఎందుకు చేస్తున్నారు? అనాధ పిల్లలు చాలా మంది ఉన్నారు, వారిని దత్తత తీసుకోవచ్చు కదా అని ప్రశ్నించింది యాంకర్ రష్మి.

అయితే మీ సొంత రక్తం అయితేనే ప్రేమిస్తారా అని సీరియస్ అయింది, ఇలా వివక్ష చూపిస్తున్నారు, కులాభిమానం మతాభిమానం లాంటిదే అని ప్రశ్నించింది… పిల్లల విషయంలో జీన్స్ కొంత వరకే ఉపయోగపడతాయని… మిగిలిందంతా తల్లిదండ్రుల పెంపకంపైనే ఆధారపడి ఉంటుందని రష్మి చెప్పింది, నిజమే ఆమె కామెంట్ పై చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు, ఇలాంటి పని చేస్తే కచ్చితంగా మన దేశంలో అనాధలు ఉండరు అని చాలా మంది అంటున్నారు.