జబర్ధస్త్ యాంకర్ రష్మి గురించి తెలియని వారుండరు. యాంకర్ గాను, ఢీ షోలో టీం లీడర్ గా ఫేమస్ అయింది రష్మీ. అయితే గతంలో సుడిగాలి సుధీర్ తో రష్మీ లవ్ లో ఉందని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆ వార్తలకు ఈ జంట ఫుల్ స్టాప్ పెట్టింది. తాము కేవలం కెమెరా ముందే ఇలా ఉన్నామని తమ మనసులో అలాంటి ఆలోచన లేదని తేల్చి చెప్పారు. అయితే.. తాజాగా రష్మీ సీక్రెట్ గా పెళ్లి చేసుకుందనే వార్త వైరల్ గా మారింది. అతను ఓ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్ గా పని చేస్తున్నాడని.. లాక్ డౌన్ లో కుటుంబ సభ్యల సమక్షంలో వీరి వివాహం కూడా జరిగిందని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం రష్మీ తన భర్తతో కలిసి.. హైదరాబాద్ లోనే నివాసం ఉంటుందని.. కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. దీనిపై రష్మీ ఎలా స్పందిస్తుందో చూడాలి మరీ.