ఇప్పుడు ఏజ్ 28, ఏ వయసులో నా పెళ్లి అంటే… యాంకర్ శ్రీముఖి క్లారిటీ

0
124

బుల్లితెరలో యాంకర్ శ్రీముఖికి ఎంత ఫేమ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమెకి చేతినిండా ఎన్నో షోలు ఉన్నాయి. ఇటు సినిమాలు చేస్తోంది టాలీవుడ్ లో ఎంతో బిజీగా ఉంది. ఈ యాంకర్ ఓ పక్క సినిమాలు మరో పక్క బుల్లితెర షోలు చేస్తోంది.
గాయకుడు మనో, నటులు రాజా రవీంద్ర, భరణిలతో కలిసి క్రేజీ అంకుల్స్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా కోసం ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాని ఈ నెల 19 న విడుదల చేయనున్నారు మేకర్స్.

ఈ సినిమాను గుడ్ సినిమా గ్రూప్స్, గ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్ నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి ఇ సత్తిబాబు డైరెక్టర్ గా చేశారు. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది శ్రీముఖి. తాజాగా శ్రీముఖి మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. పెళ్లి చేసుకోవడానికి తాను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని తెలియచేసింది. అయితే వరుడు ఫిక్స్ అయ్యాడా? ఆమె త్వరలోనే ఈ ప్రకటన చేస్తుందా అని అందరూ అనుకున్నారు.

అయితే మరో మాట చెప్పింది. మంచి వ్యక్తి దొరకడానికి సమయం పడుతుంది. మన లక్ బట్టీ జరుగుతుంది. ప్రస్తుతం తన వయసు 28 ఏళ్లని, తనకు 31 ఏళ్లు వచ్చేసరికి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని తెలిపింది. అంటే మరో 3 సంవత్సరాలు ఆమె పెళ్లి చేసుకోవడానికి టైమ్ ఉంది అంటున్నారు ఆమె అభిమానులు.