బుల్లితెర యాంకర్ శ్రీముఖి ఇరు తెలుగు రాష్ట్ర ప్రజలకు సుపరిచితం… పలు షోలకు యాంకరింగ్ చేస్తూ తన హావభావాలతో ప్రేక్షకులను ఎంతో అలరిస్తుంది శ్రీముఖి… తాజాగా ఈ ముద్దుగుమ్మపై బంజారా హిల్స్ పోలీస్టేషన్ లో కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది…
శర్మ అనే వ్యక్తి ఆమెపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది… అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది… ఓ ప్రోగ్రామ్ లో శ్రీముఖి బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని శర్మ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు..
అలాగే ఆ ఛానల్ యాజమాన్యంపై కూడా శర్మ అనే వ్యక్తి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసుకున్నారు… ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది..