యాంకర్​ సుమ..హీరోయిన్​గా ఎంట్రీ ఇవ్వబోతుందా?

Anchor Suma is going to make an entry as a heroine?

0
95

తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల ఈవెంట్లు..ఆమె లేకపోతె జరగవు. ఆమె ఎక్కడ ఉంటే అక్కడ సందడి.. ఆమె ఇంటర్వ్యూ చేయకపోతే సినిమా సక్సెస్ కూడా కాదని భావించేవారు. దశాబ్దాలుగా తన వాక్చాతుర్యంతో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేస్తున్న స్టార్ యాంకర్ సుమ కనకాల. సుమ కెరీర్ మొదట్లో హీరోయిన్ గా నటించారు. ఇక మధ్యలో అడపాదడపా కొన్ని సినిమాల్లో అక్కడక్కడా మెరిసిన సుమ ప్రస్తుతం వెండితెరపై రీ ఎంట్రీ ఇస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది.

ఇటీవల ఒక వీడియోలో సుమ మాట్లాడుతూ..అందరు నన్ను వెండితెరకు ఎప్పుడు వస్తున్నావ్ అని అడుగుతున్నారు. కనుక ఒక సారి ప్రయత్నిస్తే పోలా..అంటూ ఒక ఫన్నీ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక దీంతో సుమ రీ ఎంట్రీ పక్క అన్న విషయం అర్ధమవుతుంది. అందులోను పూర్తి వివరాలు మరికొన్ని రోజుల్లో ఉండనున్నట్లు తెలిపింది. ఈమద్య కాలంలో ఒకటి రెండు సినిమా ల్లో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చి సందడి చేసిన సుమ పూర్తి స్థాయి పాత్ర చేస్తే ఎలా ఉండబోతుందో చూడనున్నారు ప్రేక్షకులు. ఇక ఈ చిత్రానికి డైరెక్టర్ ఎవరు..? సుమ లీడ్ రోల్ చేస్తుందా..? లేక ఎవరైనా స్టార్ హీరో ఉన్నాడా..? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

1996లో ‘కళ్యాణ ప్రాప్తిరస్తు’ చిత్రంతో పెద్దతెరపై కనిపించిన సుమ.. పవిత్ర ప్రేమ, వర్షం, ఢీ, బాద్​షా చిత్రాల్లో సోదరి పాత్రల్లో నటించారు. 2019లో విడుదలైన సమంత ఓ బేబీ చిత్రంలో వ్యాఖ్యాతగా కనిపించిన సుమ కనకాల..బుల్లితెరపై తనదైన వాక్ చాతుర్యంతో ప్రేక్షకులను కట్టిపడుస్తున్నారు.