యాంకర్ సుమ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..ఎప్పుడంటే?

0
103

బుల్లితెర లో లేడీ యాంకర్ సుమ అంటే తెలియని వారుండరు. లేడీ సూపర్ స్టార్ గా పేరు పొందింది సుమ. బుల్లితెరపై ఎన్నో మ్యాజిక్ లు చేసి మనందరినీ అలరించింది. సుమ ఎటువంటి షో చేసిన అది సూపర్ హిట్ గా నిలుస్తుంది. అందుకే స్టార్ హీరోలు సైతం యాంకర్ సుమ ని ఎక్కువగా తమ సినిమా వేడుకలకు ఉండేలా ప్లాన్ చేస్తూ ఉంటారు.

అలాగే తన కెరియర్ మొదట్లో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అవి పెద్దగా గుర్తింపు రాకపోవడంతో తన అడుగులు బుల్లితెరవైపు వేసింది. ఇండస్ట్రీలో మంచి పేరు దక్కించుకున్న సుమ.. మరొకసారి అద్భుతమైన సినిమా తో అలరించడానికి మనముందుకు రీ ఎంట్రీ ఇవ్వబోతున్నది. ఇప్పుడు తాజాగా జయమ్మ పంచాయతీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతోంది.

తాజాగా ప్ర‌ముఖ యాంక‌ర్  సుమ కనకాల న‌టించిన చిత్రం `జయమ్మ పంచాయితీ. దీనికి విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ 22న విడుద‌ల చేస్తామని చిత్ర వ‌ర్గాలు వెల్లడించాయి. గ్రామీణ నేప‌థ్యంలో సాగే ఈ క‌థ‌లో ఎవరికీ, దేనికీ లొంగని నిస్వార్థపూరిత మహిళగా సుమ నటించారు. ఇక గతంలో సుమ సినిమాకు సంబంధించి పలు పోస్టులు, వీడియోలు విడుదల కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.