తెలుగులో కమెడియన్లు చాలా మంది హీరోలుగా సినిమాలు చేసిన విషయం తెలిసిందే..టాప్ కమెడియన్గా చక్రం తిప్పుతున్న సమయంలో అందాల రాముడు సినిమాతో హీరోగా మారారు సునీల్. అంతేకాదు ఈ సినిమా ఆయనకు మంచి పేరు తీసుకువచ్చింది.. కమర్షియల్ గా హిట్ అయింది లాభాలు వచ్చాయి.
అప్పట్లో రాజబాబు రేలంగి తరం నుంచి నేటి బ్రహ్మానందం అలీ వరకూ చాలా మంది కమెడియన్లు హీరోలుగా నటించారు.
2006లో విడుదలైన అందాల రాముడు చిత్రం సంచలన విజయం సాధించింది. ఆర్బీ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించారు.
టాలీవుడ్ రికార్డుల ప్రకారం అప్పట్లోనే 13 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది.
ఈ చిత్రంలో ముందు హీరో ఈయన కాదు. సునీల్ కాకుండా మరో హీరోను అనుకున్నారు. 1996లో లివింగ్ స్టన్, రంభ జంటగా వచ్చిన సుందర పురుషన్ సినిమాకు రీమేక్ గా అందాల రాముడు తీశారు. ముందు తెలుగులో ఈ సినిమాకి నటుడు
బ్రహ్మాజీ హీరోగా రీమేక్ చేయాలనుకున్నారు దర్శక నిర్మాతలు. అప్పుడు వేరే సినిమాలు చేస్తున్న బ్రహ్మజి ఈ చిత్రం తర్వాత చేస్తాను అన్నారట. సో అప్పుడు కొన్ని ఏళ్ల తర్వాత సునీల్ తో ఈ సినిమా చేశారు.
.