అందుకే సినిమాల్లో న‌టించ‌డం లేదు – శ్రీముఖి

అందుకే సినిమాల్లో న‌టించ‌డం లేదు - శ్రీముఖి

0
167

టెలివిజ‌న్ రంగం బుల్లితెర‌లో యాంక‌ర్ గా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకుంది శ్రీముఖి, ఇక బిగ్ బాస్ 3లో ర‌న్న‌ర్ గా అభిమానుల హృద‌యాల్లో నిలిచింది, అయితే ఆమె చ‌లాకీత‌నం, మాట టైమింగ్ అన్నీ షోల‌కి చాలా ప్ల‌స్ అయ్యాయి అనే చెప్పాలి.

ఇక రెండు, మూడు సినిమాల్లో కూడా శ్రీముఖి నటించింది. హీరోయిన్ గా చేసింది. జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలుగా కూడా నటించింది. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉండిపోయింది. ఆమె సినిమాలకు దూరం కావడం అభిమానులను కూడా నిరాశపరించింది. కాని ఆమె సినిమాల‌కు దూరం కావ‌డానికి కొన్ని కార‌ణాలు ఉన్నాయ‌ని తాజాగా చెప్పింది.

జులాయ్ చిత్రం చేస్తున్న స‌మ‌యంలో ఇక సినిమాలు వ‌ద్దు అని నాన్న చెప్పారు, త‌ర్వాత పాత్ర బాగున్న రెండు చిత్రాలు చేశాను, ఇక త‌ర్వాత ఫుల్ గా షోల‌కే యాంక‌రింగ్ చేస్తున్నా అన్నారు.టీవీ షోలు చేస్తుంటే, సినిమా అవకాశాలు రావని డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా చెప్పారని తెలిపింది శ్రీముఖి.
ఇక త‌ర్వాత కొన్ని సినిమా పాత్ర‌లు వ‌చ్చాయి అయినా నాకు న‌చ్చ‌క వ‌దిలేశా అని చెప్పింది ఆమె.
ఎక్స్ పోజింగ్, లిప్ లాక్ సీన్లు చేయాలని అడగడం తో అవి వ‌ద్ద‌ని వ‌దులుకున్నా అని చెప్పింది.