అనసూయకి ఆ హీరో అంటే చాలా అభిమానమట

అనసూయకి ఆ హీరో అంటే చాలా అభిమానమట

0
114

యాంకర్ అనసూయ అంటే ఇష్టం లేని వారు ఉండరు.. టాలీవుడ్ లో బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుంది ఈ అందాల తార, ఇక జబర్దస్త్ ఫ్లాట్ ఫామ్ ద్వారా ఆమెకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది యాంకర్ అనసూయ… తర్వాత సినిమాల్లో కూడా నటించింది, ఇప్పుడు ప్రత్యేక పాత్రలు చేస్తోంది, రంగస్ధలం చిత్రంలో రంగమ్మత్తగా నటన అమోఘం అనే చెప్పాలి.

యూత్ లో అనసూయకి ఒక రేంజ్ లో క్రేజ్ వుంది. ఆ క్రేజ్ కారణంగానే ఆమెకి వరుసగా సినిమాల్లోనూ అవకాశాలు వస్తున్నాయి. ఇక ఆమెకి సోషల్ మీడియాలో కూడా విపరీతమైన క్రేజ్ ఫ్యాన్స్ ఉన్నారు, తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో సరదాగా మాట్లాడుతోంది అనసూయ,

తాజాగా ఆమెని ఓ అభిమాని ప్రశ్న అడిగాడు, మీకు అప్పట్లో బాగా నచ్చిన హీరో, సినిమా ఏమిటి అని.. ఈ సమయంలో ఆమె ఓ సమాధానం చెప్పింది, శంకర్ దర్శకత్వంలో వచ్చిన జెంటిల్ మేన్ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఆ సినిమా చూసిన దగ్గర నుంచి నేను యాక్షన్ కింగ్ అర్జున్ కి అభిమానిగా మారిపోయాను అని చెప్పింది అనసూయ, నేను ఆయనకు అప్పట్లో వీరాభిమానిని అని చెప్పింది అనసూయ.