అన్నీకుదిరితే ఆ హీరోతో త్రివిక్ర‌మ్ సినిమా

అన్నీకుదిరితే ఆ హీరోతో త్రివిక్ర‌మ్ సినిమా

0
107

త్రివిక్ర‌మ్ స్టోరీ లైన్ చాలా డిఫ‌రెంట్ గా ఉంటుంది, ద‌ర్శ‌కుడిగా ఆయ‌న టేకింగ్ మాట‌లు చాలా మందికి న‌చ్చుతాయి, ఏడాదికి ఓ సూప‌ర్ హిట్ సాధించ‌డం త్రివిక్ర‌మ్ స్టైల్, అయితే ఇప్పటికే ఈ ఏడాది అల వైకుంఠ‌పురం హిట్ కొట్టారు, తాజాగా ఆయ‌న ఎన్టీఆర్ తో సినిమా చేయాలి అని రెడీ అయ్యారు, ఇప్ప‌టికే ప్రాజెక్ట్ కూడా ప్ర‌క‌టించారు.

ఇక తార‌క్ ఆర్ ఆర్ ఆర్ చిత్రం షూటింగ్ పూర్తి అయిన త‌ర్వాత త్రివిక్ర‌మ్ సినిమాకి రెడీ అవుతారు, అయితే లాక్ డౌన్ వ‌ల్ల సుమారు రెండు నెల‌లు షూటింగ్ ఆల‌స్యం అవుతోంది, ఇక త్రివిక్ర‌మ్ కూడా ఎన్టీఆర్ సినిమా క‌థ అంతా రాశారు, ఇక ఆయ‌న రావ‌డం ఆల‌స్యం, అయితే ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ కు మ‌రింత స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది కాబ‌ట్టి..

ఈలోపు విక్ట‌రీ వెంక‌టేష్ తో సినిమా తీయాల‌ని భావిస్తున్నార‌ట‌. వెంకటేశ్ తో ఓ సినిమా చేయాలని గతంలోనే త్రివిక్రమ్ అనుకున్నాడు. కథ కూడా ఓకే చేసి వుంది కానీ కొన్ని కారణాల వలన ఆలస్యమవుతూ వస్తోంది. తాజాగా అన్నీ సెట్ అయితే ముందు వెంకీతో సినిమా చేస్తారు అని అంటున్నారు, కాని ఇది టాక్ మాత్ర‌మే మ‌రి లాక్ డౌన్ త‌ర్వాత దీనిపై క్లారిటీ రానుంది.