‘మా’కు పోటీగా మరో అసోసియేషన్ రానుందా?

Another association to compete with 'us'?

0
105

మూవీ ఆర్టిస్ట్స్​ అసోసియేషన్​ ఎన్నికలు ముగిసినా సభ్యుల మధ్య నెలకొన్న భేదాభిప్రాయలు మాత్రం ఇంకా సద్దుమణగలేదు. ఇప్పటికే ‘మా’ సభ్యత్వానికి ప్రకాశ్​ రాజ్​, నాగబాబు రాజీనామా చేయగా..ఇప్పుడు ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్​ రాజ్​ ప్యానెల్​ నుంచి గెలిచిన సభ్యులూ ఇదే బాట పట్టనున్నారని సమాచారం.  మూవీ ఆర్టిస్ట్స్​ అసోసియేషన్​లో తలెత్తిన ప్రాంతీయభావం క్రమంలో ఇకపై తాము అసోసియేషన్​లో సభ్యులుగా కొనసాగలేమని తేల్చి చెప్పారు.

అయితే ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్​ రాజ్​ ప్యానెల్​ తరపున పోటీపడి గెలిచిన సభ్యులు మంగళవారం సాయంత్రం 5 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు. వీరంతా ‘మా’ను వీడనున్నారని టాలీవుడ్​లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ‘మా’కు పోటీగా మరో అసోసియేషన్​ ఏర్పాటు చేసిన దానికి ‘ఆత్మ'(ఆల్​ తెలుగు మూవీ ఆర్టిస్ట్స్​ అసోసియేషన్​) అని పేరు పెట్టనున్నారని తెలుస్తోంది.