వరుస ఆఫర్లు అందుకుంటూ తెలుగు తమిళ బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో బిజీగా ఉంది పూజా హెగ్డే, అయితే ఆమెకి మరో ఆఫర్ తాజాగా వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి,
హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో నటించనున్నట్టు, అందులో పౌరాణిక పాత్ర పోషించనున్నట్టు తెలుస్తోంది. ఈ వార్త ఇప్పుడు టాలీవుడ్ కోలీవుడ్ లో వినిపిస్తోంది.
అది ఏమిటి అంటే, కాళిదాసు కవిత్వంలో.. రవివర్మ కుంచెలో కొత్త అందాలు సంతరించుకున్న శకుంతల పాత్రను పూజా చేయనుంది అని తెలుస్తోంది, అయితే ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించనున్నారు, ఇప్పటికే శాకుంతలను ప్రకటించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి ఈ సినిమాకి.
అయితే ఈ పాత్రకి పూజాతో చర్చలు జరిపారు అని వార్తలు వినిపిస్తున్నాయి.. రోల్ నచ్చడంతో ఆమె కూడా చేసేందుకు ఒకే చెప్పారు అని అంటున్నారు, అయితే ఈ సినిమా మూడు నెల్లలో షూటింగ్ కంప్లీట్ చేయనున్నారట, అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.