పూజా హెగ్డే తెలుగులో వరుస చిత్రాలు చేస్తూ బిజీగా మారింది ఈ తార, అన్నీ టాప్ సినిమాలే సూపర్ హిట్ చిత్రాలే… సెట్స్ పై ఉన్న సినిమాలు అన్నీ పెద్ద హీరోల చిత్రాలే… వచ్చే ఏడాది వరకూ ఆమె డేట్స్ ఫుల్ బిజీగా ఉన్నాయి, చిత్ర పరిశ్రమలోని హీరోలకు హాట్ ఫేవరేట్గా మారింది పూజ.
బాలీవుడ్ లో కూడా సూపర్ సక్సెస్ లో దూసుకుపోతోంది, సల్మాన్ ఖాన్ సరసన కభీ ఈద్ కభీ దీవాళీ సినిమాలో నటిస్తోంది. తన మాతృ భాష కన్నడలో ఇప్పటి వరకూ ఒక్క సినిమా చేయలేదు, దీంతో తన సొంత ప్రాంతం కన్నడలో సినిమా ఛాన్స్ కొట్టేసింది.
ప్రభాస్, ప్రశాంత్ నీల్ సినిమా సలార్ మూవీలో నటించనుంది. అయితే ఈ సినిమా పూర్తి ప్యాన్ ఇండియా చిత్రం, అయితే కన్నడ భాషా నటులని ఎక్కువగా తీసుకుంటున్నారు, అందుకే పూజకి ఆ ఛాన్స్ వస్తుందట…రాధే శ్యామ్ సినిమాలో ఇప్పుడు ప్రభాస్ తో కలిసి నటిస్తోంది, సో తర్వాత చిత్రంలో కూడా ఆమె ప్రభాస్ తో నటించనుంది. ఇక డేట్స్ కూడా ఆమె ఇప్పటికే చెప్పేశారు అని తెలుస్తోంది.అల వైకుంఠపురములో, అరవిందసమేత, ఒక లైలా కోసం.ముకుందా.దువ్వాడ జగన్నాథం.మహర్షి
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, రాధేశ్యామ్ చిత్రాల్లో నటించింది ఈ భామ.