మరో వివాదంలో కత్తి మహేష్ ఈసారి ఏం చేస్తారో

మరో వివాదంలో కత్తి మహేష్ ఈసారి ఏం చేస్తారో

0
84

సినిమాలకు రివ్యూలు చెబుతూ ఇటు రాజకీయాలకు సంబంధించిన విషయాలపై కొన్ని మీటింగులకి హాజరు అవుతూ… ఇలా అనేక బిజీ షెడ్యూల్ తో ఉంటారు వివాదాల విమర్శకుడు కత్తి మహేష్.. ఓ పక్క బిగ్ బాస్ కు వెళ్లిన తర్వాత ఆయన ఫాలోయింగ్ మరింత పెరిగింది.

అయితే కత్తి, పవన్ కల్యాణ్ ని టార్గెట్ చేసిన తర్వాత పవన్ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. తాజాగా కత్తి మహేష్ శ్రీరామునిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు వచ్చింది.

దీనిపై ఐపీసీ సెక్షన్ 502 కింద కేసు నమోదు చేశారు. ఎప్పుడూ ఏదో ఓ కాంట్రవర్సీని క్యారీ చేసే కత్తి మహేష్ ఈ సారి శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు, శ్రీరాముడికి జింక నెమలి ఫేవరెట్ డిష్ అని అన్నారు, అంతేకాదు సీతమ్మ కూడా జింకను తీసుకురమ్మని కోరింది అది ఎందుకు అనుకుంటున్నారు వండుకు తినడానికి అని అన్నారు, రాముడికి చాలా మంది అంతపురంలోని వేశ్యలతో సంబంధం ఉందని అన్నాడు కత్తి మహేష్.

దీనిపై శ్రీరాముని భక్తులు తీవ్రంగా ఆయనని విమర్శిస్తున్నారు, సోషల్ మీడియాలో కత్తి గురించే చర్చ జరుగుతోంది, దీనిపై ఆయన మాట్లాడుతూ తాను భయంకరమైన హిందువునని, దేన్నీ గుడ్డిగా ఫాలో కాబోనని, వాల్మీకి రామాయణ అనువాదంలోని ఉత్తర కాండలో ఉన్న 42 సర్గ, 18 నుంచి 22 వరకూ వచనాలు, యుద్ధకాండంలోని వచనాలు చూడాలని సమాధానం ఇచ్చారు. గతంలో కూడా రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు కత్తి …దీంతో ఆయనని ఆరు నెలలు హైదరాబాద్ నుంచి నగర బహిష్కరణ చేశారనే విషయం తెలిసిందే.