హాట్ బ్యూటీ సన్నీ లియోనీ మరో వివాదంలో చిక్కుకుంది. ఇటీవల రిలీజైన ఆల్బమ్ సాంగ్ ‘మధుబన్’ను బ్యాన్ చేయాలని పలువురు పురోహితులు డిమాండ్ చేశారు. అందులో సన్నీ లియోనీ అభ్యంతరకరంగా డ్యాన్స్ చేసిందని వారు ఈ పాటను నిషేధించాలని డిమాండ్ చేశారు.
కాగా ‘మధుబన్’ మ్యూజిక్ వీడియో యూట్యూబ్లో నెటిజన్లను అలరిస్తూ వ్యూస్లో దూసుకుపోతుంది. రాధ-కృష్ణుల మధ్య ప్రేమను వర్ణిస్తూ ఈ పాట లిరిక్స్ ఉంటాయి. అలాంటి ఈ గీతానికి సన్నీ స్టెప్పులు హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నాయని పలువురు నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ పాట ఒరిజినల్ 1960లో వచ్చిన ‘కోహినూర్’ సినిమాలోనిది. దిగ్గజ సింగర్ మహమ్మద్ రఫీ.. దీనిని పాడారు. ఇప్పుడు దీనిని రీమేక్స్ చేసి ఆల్బమ్ సాంగ్ కోసం ఉపయోగించారు. ప్రభుత్వం ఈ వీడియోను బ్యాన్ చేయకపోతే మేం కోర్టును ఆశ్రయిస్తాం” అని బృందావన్ సంత్ నవల్ గిరి మహారాజ్ స్పష్టం చేశారు.