టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్​..చిరుతో ఆ స్టార్ డైరెక్టర్ సినిమా!

0
105

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా కంప్లీట్ చేసారు. ఈ సినిమాలో తొలిసారి పూర్తి స్థాయిలో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించబోతున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 29న  విడుదల చేయనున్నారు.

చిరంజీవి  ఆచార్య’ తర్వాత ‘లూసీఫర్’ రీమేక్ ‘గాడ్ ఫాదర్’ స్టార్ట్ చేసారు. అలాగే మోహన్‌రాజా దర్శకత్వంలో ‘గాడ్‌ ఫాదర్‌’, మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో ‘భోళాశంకర్‌’ సినిమాలు చేస్తున్నారు. కె. ఎస్‌. రవీంద్ర (బాబీ)తో ఓ చిత్రం ఖరారు చేశారు. టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్లపై ఉండే అంచనాలు అన్నీ ఇన్నీ కావు. తాజాగా టాలీవుడ్​లో మరో క్రేజీ కాంబినేషన్​ సెట్​ కానుంది. మెగాస్టార్ చిరంజీవితో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ సినిమా చేయనున్నాడు. ఈ విషయాన్ని ఆయన సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

“మెగాస్టార్‌ను డైరెక్ట్‌ చేయాలనే నా కల నిజమైంది. వివరాలు అతి త్వరలోనే తెలియజేస్తా” అంటూ చిరంజీవితో దిగిన ఫొటోని షేర్‌ చేశారు. సుకుమార్‌ అనూహ్య ప్రకటనతో సినీ అభిమానులు సర్‌ప్రైజ్‌ ఫీలవుతున్నారు. ఓ వాణిజ్య ప్రకటన కోసం ఈ ఇద్దరూ కలిసి పనిచేస్తున్నట్టు సమాచారం. ఇదే కాంబినేషన్‌లో ఓ సినిమా కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల ‘పుష్ప’తో మంచి విజయం అందుకున్న సుకుమార్‌ ప్రస్తుతం ఆ సినిమా సీక్వెల్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభంకానుంది. మరోవైపు, యువ నటుడు విజయ్‌ దేవరకొండతో ఓ చిత్రాన్ని ఇప్పటికే ప్రకటించారు.