‘పుష్ప’ సినిమా తరువాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు బన్నీ పాన్ ఇండియా స్టార్. అంతలా పుష్ప మేనియా నడుస్తుంది. ఎక్కడ చూసిన పుష్ప మ్యానరిజం చూపిస్తున్నారు. మరీ ముఖ్యంగా పుష్ప..పుష్పరాజ్ తగ్గేదే లే, శ్రీవల్లి స్టెప్ సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేశాయి.
ఇక ప్రస్తుతం అల్లుఅర్జున్ పుష్ప-2 సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ తదుపరి సినిమాపై ఓ వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. తన తరువాతి సినిమా ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీతో చేయబోతున్నారని తెలుస్తుంది.
ఈ సినిమాకు బన్నీ ఏకంగా రూ.100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోనున్నట్లు సమాచారం. ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా లైకా ప్రొడక్షన్స్ నిర్మించనున్నారట. ఇప్పటికే లైకా ప్రొడక్షన్స్ కత్తి, 2.0 సినిమాలను నిర్మించారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది.