గంగవ్వ అభిమానులకి మరో గుడ్ న్యూస్

-

బిగ్ బాస్ ప్రజలకు బాగా దగ్గర అయిన షో తెలుగులో సీజన్ 4 మరింత మందిని ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది, అంతేకాదు ఇందులో స్పెషల్ కంటెస్టెంట్ గా ఉన్న గంగవ్వ ఆట అందరికి నచ్చింది, ఆమెకి లక్షలాది మంది అభిమానులు ఉన్నారు, అయితే గంగవ్వకి అనారోగ్యం కారణంగా ఐదో వారం హౌస్ నుంచి బయటకు వచ్చేసింది, మొత్తానికి నాగార్జున బిగ్ బాస్ టీమ్ ఇంటి సభ్యులు గంగవ్వని మంచిగా చూశారు.

- Advertisement -

ఈసారి ఒక పల్లెటూరుకు చెందిన దాదాపు 60 ఏళ్ల మహిళను బిగ్ బాస్ హౌస్ లోకి ప్రత్యేకమైన కంటెస్టెంట్ గా తీసుకోవడం జరిగింది. గతంలో ట్రాన్స్ జెండర్స్ తీసుకున్నా పెద్దగా జనాల దృష్టిని ఆకర్షించలేదు, కాని గంగవ్వ తొలి నుంచి ప్రత్యేకంగా ఉంది హౌస్ లో.

ఆమె ఇబ్బంది పడుతుందనే ఉద్దేశ్యంతో ఏసీలను కూడా పలు సందర్బాల్లో ఆపేసిన దాఖలాలు ఉన్నాయి. తనకు ఇల్లు కట్టుకునేందుకు డబ్బులు వస్తాయనే ఉద్దేశ్యంతో బిగ్ బాస్ కు వచ్చానంటూ చెప్పింది గంగవ్వ. ఆమె మొదటి నుండి కూడా తన ఇంటి గురించి తాపత్రయ పడుతుంది, ఇక బిగ్ బాస్ ఇచ్చే రెమ్యునరేషన్ తో పాటు ఆమెకి నాగార్జున కూడా కొంత నగదు సాయం చేశారు, మొత్తానికి బిగ్ బాస్ టీమ్ ఆమెకి చెక్ ఇచ్చేశారట.

ఆమె ఇంటికి కావాల్సిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆమె ఇంటి కోసం ప్లానింగ్ రెడీ చేశారట. దాదాపు 15 లక్షలతో గంగవ్వకు ఇల్లు కట్టించి బిగ్ బాస్ హౌస్ అంటూ ఆ ఇంటికి పేరు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి అంటున్నారు, దీంతో గంగవ్వ సంతోషంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...