టాలీవుడ్ లో ప్రిన్స్ మహేష్ బాబుకి లక్షలాది మంది అభిమానులు ఉన్నారు..సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి ముందుగా రమేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత మహేష్ బాబు తండ్రి బాటలో హీరోగా ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ బాక్సాఫీస్ను షేక్ చేస్తూ టాప్ హీరోగా ఉన్నారు, అయితే ఆ తర్వాత
కృష్ణ ఫ్యామిలీ నుంచి ఆయన.. చిన్నల్లుడు సుధీర్ బాబు హీరో అయ్యాడు, ఇక తర్వాత మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక కృష్ణ రెండో భార్య విజయనిర్మల ఫ్యామిలీ నుంచి సీనియర్ నరేష్ కామెడీ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఆయన కుమారుడు నవీన్ విజయ్ కృష్ణ కూడా నందిని నర్సింగ్ హోం చిత్రంలో ఇటీవల ఎంట్రీ ఇచ్చారు, ఇక తర్వాత చూసుకుంటే కృష్ణ రెండో కూతురు మంజుల భర్త సంజయ్ స్వరూప్ సహాయ నటుడి పాత్రలో అలరిస్తున్నాడు. తాజాగా కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఎవరో కాదు విజయనిర్మలకు మనవడు శరన్. ఈయన కృష్ణ కి కూడా మనవడి వరసే అవుతాడు.రామచంద్ర వట్టికూటి అనే డైరెక్టర్ తో ఆయన సినిమా చేయనున్నాడట